మీకు ఎప్పుడైనా అనిపించిందా? దేవుడా నేను ఎంత కష్టపడినా పొట్ట మాత్రం తగ్గటం లేదు అని? మీరేకాదు అందరికీ ఇదే సమస్య. ఒక గంట జిమ్ కో యోగ కో.. వెళ్లి రోజంతా ఏదిపడితే అది తినేస్తే పొట్ట ఎలా తగ్గుతుంది.??
ఆరోగ్యంగా ఉండాలి స్లిమ్ గా, అందంగా కనపడాలి అని ఎవరికైనా ఉంటుంది.
ఎదురుగా అమ్మాయి లేదా అబ్బాయి ఉనప్పుడు ఊపిరి బిగపెట్టి పొట్టని బలవంతంగా లోపలికి దాచుకోడానికి ట్రై చేశారా.? ఖచ్చితంగా చేసే ఉంటారు.
పొట్ట తగ్గడానికి జిమ్ కి వెళ్ళక్కర్లేదు, వెయిట్ లాస్ ఇన్స్టిట్యూట్ లో చేరాల్సిన అవసరం లేదు. జస్ట్ ఈ హెల్త్ టిప్స్ ఫాలో అయిపోండి చాలు.
1. తగినంత నిద్రపోండి
ప్రతి రోజు 8 గంటలు నిద్రపోండి. నిద్ర సరిగ్గా లేకపోతే రోజంతా అలసటగా ఉంటాం. ఇదే మొదటి సలహా.
2. ఆకలిగా ఉన్నప్పుడే తినండి
ఈ నూతన సమాజంలో ఆకలిగా ఉన్నా లేకపోయిన, సంతోషంగా ఉన్నా, బాధగా ఉన్నా బాగా జంక్ ఫుడ్స్ తినేస్తుంటాం. ఏదో టాపిక్ డిస్కస్ చేసే టైం లోనో లేక టీవీ చుస్తూనో లేక ఫోన్లో మాట్లాడుతూనో లేక వర్క్ చేస్తూనో 2-3 చిప్స్ పాకెట్స్, అమ్మ పంపిన స్నాక్స్, 1 కోక్ 1 ఎగ్/వెజ్ పఫ్, పానిపురి ఇలా ఒక లిస్ట్ లాగించేస్తాం. ఇంకేముంది డైటింగ్ హుష్ పటాక్.
అందుకే బాగా తినాలి అనిపించినపుడు 1 గ్లాస్ నీళ్ళు తాగేయండి. లేదంటే తాజా కూరగాయలు తినండి.
3. రాత్రి భోజనం త్వరగా చెయ్యండి
రాత్రి నిద్రపోవటానికి 2-3గంటల ముందే డిన్నర్ చేసేయండి.ఆఫీస్ పనుల వల్లో లేక ఇంకేమన్నా కారణం చేతనో రోజంతా తినకుండా నిద్రపోయే ముందు ఫుల్లుగా లాగించేసి నిద్రపోతాం. ఇలా చేయటం వల్ల మన శరీరంలో ఉన్న అదనపు పోషకాలు కొవ్వు రూపంలోకి మారిపోతాయి.
అసలే పొట్ట తగ్గలేదు అని దిగులుతో ఆలస్యంగా తింటే అదనపు కొవ్వు(Fat) ఇంకా ఎక్కువ అయ్యి పొట్ట కూడా పెరిగిపోతుంది.
4. నీళ్ళు బాగా తాగండి
నీళ్ళు బాగా తాగాలి. ఎందుకంటే శరీరం మెటబోలిసం ని పెరిగే విదంగా చేసేది మనం రోజు తాగే నీళ్ళు ఒక్కటే. దాహం వేసినపుడు నీళ్ళు తాగాలి కాని షాప్ లో ఉండే అన్ని రకాల కూల్ డ్రింక్స్ ట్రై చేస్తే మనకే నష్టం. ప్రతిరోజూ కనీసం 4-5 లీటర్లు నీళ్లు తాగండి.
5. తక్కువ ఆహారాన్ని ఎక్కువ సార్లు తినండి
మీ బరువు తగ్గాలి, పొట్ట తగ్గాలి అనుకుంటే ఎక్కువ సార్లు తక్కువ ఆహరం తీసుకోవాలి. రెస్టారెంట్లకి వెళ్ళడం తగ్గించాలి. ఎందుకో తెలుసా? మనం ఇచ్చే డబ్బులకి న్యాయం చేయాలి అనే ఉద్దేశంతో పొట్టకి పట్టినా పట్టకపోయినా బాగా లాగించేస్తాం కనుక.
6. రోజూ నడవడం అలవాటు చేసుకోండి
చాలా మంది వాళ్ళ సమయాన్ని టీవీ చూడటంలోనో, ఆఫీస్ పనిలోనో, మొబైల్ చాట్టింగ్ బిజీలోనో ఎక్కడ కూర్చుంటే అక్కడే ఉండిపోతారు. ఇలా చేయడం వల్ల శరీరంలో ఉన్న అదనపు కొవ్వు అంతా పొట్టకి చేరి పొట్ట సైజు కాస్తా పెరిగిపోతుంది.
అందుకే అప్పుడప్పుడూ నడుస్తూ ఉండండి.
వీటితో పాటు ఈ కింది ఆహార నియమాలను పాటించండి.
ఆహార నియమాలు:
1. ప్రతిరోజు ఉదయాన్నే ఒక గ్లాస్ లెమన్ వాటర్ తాగండి.
2. ప్రతిరోజు గ్రీన్ టి తాగండి. ఇది అదనపు కొవ్వుని కరిస్తుంది.
3. పిజ్జాలు బర్గర్లు తినడం మానేసి పండ్లు, కూరగాయలు తినండి.
ఈ నియమాలను ప్రారంభించేముందు ఒక విషయం గుర్తు పెట్టుకోండి. ఏది వెంటనే జరిగిపోదు, మన ప్రయత్నమే మనల్ని ముందుకు నడిపిస్తుంది. ఎవరో చెప్పారని ఇన్స్టిట్యూట్స్ లో చేరడమో ట్రీట్ మెంట్ తీసుకోవటమో ఇవన్నీ మానుకోండి. ఈ సలహాలు కఠినంగా పాటించండి, సంతోషంగా ఉండండి.
ఈ ఆర్టికల్ పైన కామెంట్స్ మరియు సలహాలు దయచేసి తెలియజేయండి.